Saturday, 7 November 2026

పోస్టల్ ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోవాలి పోస్టల్ ఇన్స్పెక్టర్

పోస్టల్ ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోవాలి
పోస్టల్ ఇన్స్పెక్టర్
సందీప్
ఫోటోరైటఫ్:చీదేళ్ల గ్రామంలో ఇన్సూరెన్స్ పై అవగహన కల్పిస్తున్న సందీప్

పెన్ పహాడ్. నవంబర్ 26 (జనం సాక్షి) :నూతనంగా రూ.399తో పోస్టపిసుల్లో ప్రవేశ పెట్టిన రూ.10 లక్షల ప్రమాద బీమా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జి.సందీప్ కోరారు శుక్రవారం మండల పరిధిలోని చీదేళ్ళ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ ప్రమాద భీమా రోడ్డు ప్రమాదాలే కాకుండా పాముకాటు, విద్యుత్ షాక్ తో చనిపోయిన వారికి కూడా ఈ స్కీము వర్తిస్తుందని
ఖాదారారుడు మరణిస్తే రూ.10 లక్షలు,శాశ్వత అంగవైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.10 లక్షలు, వైద్య ఖర్చుల కింద రూ.60 వేలు, విద్యా ప్రయోజనాల కింద రూ.లక్ష, ఆసుపత్రిలో రోజూవారి నగదు కింద..10 రోజుల వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తారని తెలిపారు.అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని చికిత్స సమయంలో ఐపిడీ ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయం అయితే ఓపిడి కోసం రూ. 30 వేలు ఇస్తారని ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5,000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుందని తెలియపరిచారు ఈ స్కీం కి ఖాతాదారుడి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలని వివరాలకు స్థానిక పోస్ట్ ఆఫీసునుసంప్రదింగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిపిఎం స్వాతి రెడ్డి, ఎంపిటిసి జూలకంటి వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ బిజీగ గోపయ్య, మాజీ సర్పంచ్ గుర్రం గోపాల్ రెడ్డి, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది షేక్ మల్సూర్, వార్డు మెంబర్లు,గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు