Wednesday, 4 November 2026

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

జూలూరుపాడు, డిసెంబర్ 6, జనంసాక్షి: రాజ్యాంగ నిర్మాత, విశ్వ విజ్ఞాని, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ కమిటీ అధ్యక్షులు వేల్పుల నర్సింహారావు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి అంబేడ్కర్ వాదులు మోదుగు అదాం, వేపూరి నర్సింహారావులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదుగు ఆదాం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారని కొనియాడారు. ఆర్ధిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తుదిశ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ మండల అధ్యక్షులు మోదుగు సుగుణరావు, జర్నలిస్ట్ మోదుగు ప్రభాకర్, ఉబ్బపల్లి సంజీవరావు, దాసరి నాగయ్య, వేల్పుల రవి కుమార్, మోదుగు మహేందర్ కుమార్, మోదుగు ఉదయ్ కుమార్, మోదుగు కిరణ్ కుమార్, వేల్పుల సన్నీ, మోదుగు పృథ్వి తదితరులు పాల్గొన్నారు.