బిచ్కుందలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
బిచ్కుంద డిసెంబర్ 06 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రములో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పిటిసి భారతి రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారని కొనియాడారు. ఆర్ధిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం వరకు ఆయన పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ పటేల్, వెంకట్రావు దేశాయ్, కల్లాలి సంజూ పటేల్, ఖత్గాం హన్మండ్లు, హాజీ లక్ష్మణ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు
బిచ్కుందలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి




