Wednesday, 4 November 2026

యదాద్రిజిల్లా తుర్కపల్లి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్
కొండాపూర్ లో నాణ్యత లేకుండా సిసి రోడ్ల నిర్మాణం.
ఫోటో రైట్ అప్01 తుర్కపల్లి నాణ్యత లేకుండా రాత్రిపూట సిసి రోడ్లు పోస్తున్న దృశ్యం.
తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో 25 లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో పూర్తిగా నాణ్యత లోపంగా సిసి రోడ్లు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 25 లక్షల తో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనుల్లో పూర్తిగా నాణ్యత లోపంగా రాత్రి వేళల్లో సీసీ రోడ్డును సర్పంచ్ , ఏఈ, ఎలాంటి అధికారులు లేకుండా నిర్మించడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . గ్రామంలో నిర్మిస్తున్న సిసి రోడ్డులో ఇసుక తక్కువ వాడి డేస్ట్ తో సిసి రోడ్లను నిర్మాణం చేపడుతున్నారని, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా సీసీ రోడ్ల పనులను చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల నుండి సీసీ రోడ్ల నిర్మాణం కు గ్రామపంచాయతీ ట్రాక్టర్ను వాడుతున్నారని ఆరోపించారు. ఇట్టి విషయంపై ఏఈ తులసి కృష్ణను వివరణ అడగగా మాకు నాణ్యమైన పనులు కావాలి కానీ గ్రామపంచాయతీ వేరే టాక్టర్ తో మాకు సంబంధం లేదని అన్నారు. మేము అందుబాటులో లేకున్నా నాణ్యత ఉంటే సరిపోతుందని వివరణ తెలిపారు.