పరామర్శ జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి క్రాస్ రోడ్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వార్త రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ వారి కుటుంబాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ … పాత్రికేయులు అంటే సమాజానికి సేవ చేసే వారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ అనేకమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వారు ముందుంటారని అలాంటి వారు ప్రాణాలను లెక్కచేయకుండా ముందుకు వెళుతూ ఉంటారని, అలాంటి వారిని బాధ పెట్టడం సరైనది కాదని అన్నారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోలుమూరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్ మంథని నియోజకవర్గం జాయింట్ కన్వినర్ తొట్ల రాజు,మండల యువ నాయకులు రేణుకుంట్ల విజయ్, కుమ్మరి నరేష్, కన్నురి మోహన్, ఇల్లందుల సది బన్నీ, గణేష్, అజార్ తదితరులు పాల్గొన్నారు.




