కళ్యాణ మహోత్సవం – గట్టుపై సాంస్కృతిక కార్యక్రమాలు – అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
హుజూర్ నగర్ ఫిబ్రవరి 6 (జనం సాక్షి): హుజూర్ నగర్ పరిధిలోని ఫణిగిరి గట్టుపై స్వయం వ్యక్త శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. రామచంద్ర స్వామి వారిని, సీతమ్మను పట్టు వస్త్రాలతో, పూలమాలలతో అందంగా అలంకరించారు. శ్రీ స్వామివారిని పల్లకిలో, అమ్మవారిని సర్వ సప్నం వాహనంపై అధిష్టింపజేసి గట్టుపై నుంచి గట్టు కింద ఉన్న కళ్యాణ మండపానికి మేళ తాళాలతో జై జై ధ్వనాలతో తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణం ఆసాంతం పీఠలపై కూర్చొని పూజ నిర్వహించారు. మొదట విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం జరిపి కంకణ ధారణ చేశారు. అమ్మవారి తరఫున వేద పండితులు స్వామివారికి పాదపక్షాలను కావించి, గూడ జీలకర్ర ధారణ జరిపారు. తదుపరి మంగళసూత్రాన్ని అమ్మవారికి ధరింపజేసి తలంబ్రాలను పోశారు. కళ్యాణ ఘట్టం ఆద్యంతం అర్చక స్వాముల వేదమంత్రాలతో ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. గుట్టపై దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కళ్యాణ మండపాన్ని అరటి ఆకులతో, పూలదండలతో తీర్చిదిద్దారు. కళ్యాణోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభ భక్తులను విశేషంగా ఆకర్షించింది. కళ్యాణ ఘట్టం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కార్యనిర్వాహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. భక్తులకు మంచినీళ్లు, విద్యుత్తు, వైద్య సహాయం మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు కోటా సూర్యప్రకాష్ రావు, గుండా రమేష్, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, బెల్లంకొండ సైదులు గౌడ్,
పోనుగుపాటి అశోక్, వెన్న తిరుపారెడ్డి, నర్సింగ్ వెంకటేశ్వర్లు, పశ్య శ్రీనివాస్ రెడ్డి, బెల్లంకొండ వెంకట నారాయణ, మహిళలు గుండా ఫణి కుమారి, దొంతి రెడ్డి పద్మావతి, వెన్న పద్మ ,అర్చకులు భాస్కరాచార్యులు, మురళీ కృష్ణమాచార్యులు, రాఘవ చార్యులు, కృష్ణమాచార్యులు, దామోదరాచార్యులు, స్థానాచార్యులు, దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




