పెనుబల్లి, పిబ్రవరి 6(జనం సాక్షి)పెనుబల్లి మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు అధ్యక్షతనసోమవారం మండాలపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి జిల్లా ఇంచార్జీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నె ఉదయ ప్రతాప్ పాల్గొని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు గురించి, బూతు కమిటీ అధ్యక్షుల కార్యచరన, మోడీ ప్రవేశపెట్టిన పథకాలు, కిసాన్ యోజన, బేటీ బచావొ, రైతు భీమా,ఆవాస్ యోజన , తదితర పథకాలు గురించి మాట్లాడటం జరిగింది,
కార్యక్రమంలోఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామ లింగేశ్వరరావు , నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని విరంరాజు, జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ రావు , జ్వాల నరసింహారావు, జిల్లా కార్యదర్శి నకిరికంటి వీరభద్రం,ప్రధాన కార్యదర్శి ఒరుగంటి రాము, ఎస్ సి మోర్చా పేర్ల మహేష్, ఎస్ టి మోర్చ బాణోత్ రమేష్, కిసాన్ మోర్చా నాయుడు గోవర్థన్, బంకా రామకృష్ణ, యువ మోర్చా బలుసుపాటి మోహన్, కార్తీక్, జోసెఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .




