-రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.-హామీల అమలుకై బిఎస్పీ పోరాటం.
-13న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా.-బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6(జనంసాక్షి):అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలను మరోసారి నిరాశకు గురి చేసిందని తెల్కపల్లి మండల కేంద్రంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ తీవ్రంగా దుయ్యబట్టారు.2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను, ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 2018 ఎన్నికల సందర్బంగా నాగర్ కర్నూల్ లో నిర్వహించిన సభలో రైతులకు 1లక్ష రూపాయల ఋణ మాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించ్చారు.సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 1లక్ష రూపాయల ఋణ మాఫీకి ఇంకా నిబంధనలు రూపొందించలేదని చెప్పడం హాస్యాస్పదం అనీ అన్నారు. అట్లాగే నిరుద్యోగులకు 3016/-లు ఇస్తామని చెప్పిన హామీ, అసలు కెసిఆర్ ప్రభుత్వానికి గుర్తుందా అనీ నిలదీశారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ అనీ ఆరోపించారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు 5నుంచి 6లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కి, బడ్జెట్లో 3లక్షలు ప్రవేశ పెట్టడం ఏంటని ప్రశ్నించ్చారు. ఇక డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్నీ బీఆర్ఎస్ పార్టీ అటకకు ఎక్కించిందని అన్నారు.ఈ ప్రభుత్వం చివరి బడ్జెట్ లో కూడా పేదలకు అన్యాయమే జరిగిందని తెలిపారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో గిరిజనులకు కూడా మోసం చేసిందని అన్నారు. మొత్తంగా నిరుద్యోగులను- గిరిజనులను-రైతులను-పేదలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీనీ, రానున్న ఎన్నికల్లో బొంద తీసి పాతీ పెట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకై బిఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున్న హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్, తెల్కపల్లి మండల అధ్యక్షులు ఆర్.శివ శంకర్, తెల్కపల్లి మండల నాయకులు బాల నాగులు, సుల్తాన్, సామ చెన్నయ్య, మొగులాల్, రాజేష్, లాలు సాగర్, దశరథం, విష్ణు, సాయిలు, శివ, గోపాల్, రామ్ లతో పాటు బహుజన కళా వేదిక జిల్లా అధ్యక్షులు గుడిపల్లి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.




