బిచ్కుంద జూన్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం నాడు బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆవాసంలో గల బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం మొదటి రోజు నిర్వహించామని వారన్నారు. కార్యక్రమంలో కిషోర్, రచ్చ శివకాంత్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుందలో బడిబాట కార్యక్రమం ప్రారంభం




