ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన టిపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 08 , ( జనం సాక్షి ) : డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీపీసీసీ రాష్ట్రఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మది న వేడుకలు టీపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా జన్మదిన కేకును చేపూరి వినోద్ కట్ చేసి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రాబోతుందని, ప్రజలందరూ కాంగ్రెస్ నే కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంద ని అన్నారు.జన్మదినంసందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చేపూరి చిరంజీవి,ఐలయ్య,సాంబరాజు,ఏలియా, సుదర్శన్, సామ్యూల్, సతీష్,రాజకుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.