Thursday, 5 November 2026

ఘనంగా వడ్డె ఓబన్న 216 వ జయంతి.

ఘనంగా వడ్డె ఓబన్న 216 వ జయంతి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జనవరి11(జనంసాక్షి):

వడ్డెర కుల బందువులకు వడ్డెర ముద్దుబిడ్డ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డె ఓబన్న 216వ జయంతిని కొల్లాపూర్ పట్టణంలో కేఎల్ ఐ విశ్రాంతి భవనం లో తాలూకా వడ్డెర సంఘం అధ్యక్షుడు ఓర్సు వెంకటస్వామి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేకును కత్తిరించడం జరిగింది.అనంతరం వడ్డెర సంఘం నాయకులు ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండల వెంకటస్వామి మాట్లాడుతూ వడ్డెరుల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు.ఆయన పోరాట పటిమ తో వడ్డెరుల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాయని కురుమూర్తి,మాచుపల్లి సత్యం,గోవుల శివుడు,గోవుల మాహేష్,రాము, మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.