Thursday, 5 November 2026

పేద ప్రజలకు రేషన్ బియ్యం సకాలంలో అందించాలి – సామాజిక కార్యకర్త మన్సూర్ అలీ

పేద ప్రజలకు రేషన్ బియ్యం సకాలంలో అందించాలి – సామాజిక కార్యకర్త మన్సూర్ అలీ
హుజూర్ నగర్ జనవరి 11 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నందు సామాజిక కార్యకర్త మన్సూర్ అలీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రేషన్ బియ్యం సకాలంలో అందజేయాలని డీఈఓ కమలాకర్ కి వినతి పత్రం అందజేశారు. బుధవరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఐదో తారీకు నుంచి రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారులకు ఎఫ్ ఎస్ సి, ఏ ఎఫ్ ఎస్ సి , అన్నపూర్ణ కార్డుదారులకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంచదార పంపిణీ చేసేది కానీ కొత్త సంవత్సరం నెల వచ్చి సగం రోజులైనా నేటి వరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంచదార పంపిణీ చేయలేదనీ తద్వారా ప్రజలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ బియ్యం ఎప్పుడు ఇస్తారా అని పనులు మానుకొని ఎదురుచూపులు చూస్తున్నారనీ అన్నారు. వెంటనే పౌరసరఫరాల అధికారులు స్పందించి పేద ప్రజలకు బియ్యం, పంచదార పంపిణీ చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర పౌరసర పరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ కి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి ట్విట్టర్ ద్వారా సమస్యను తెలిపారన్నారు.