Monday, 2 November 2026

ఘనంగా వాసవి అమ్మవారి జయంతి వేడుకలు

 

 

 

 

 

జూలూరుపాడు, ఏప్రిల్ 30, జనంసాక్షి: ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. వాసవి మహిళలు కలశాలతో ప్రదర్శనగా జై వాసవి, జై జై వాసవి అంటూ నినాదాలు చేస్తూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పూజారులు శ్రీరామచంద్రమూర్తి, సాయి కృష్ణ శర్మల మంత్రోచ్ఛారణల నడుమ గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, వాసవి మాత కరుణాకటాక్షాలతో ప్రజలు సుఖశాంతులతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాల వినియోగం జరిగింది. మండల ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల విజయభాస్కర్, మండల అధ్యక్షుడు పెండ్యాల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి తొండపు సుబ్బారావు, కోశాధికారి కొదుమూరి భాను ప్రకాష్, కార్యదర్శి వేముల గురునాథం, కళ్యాణ మండపం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెండ్యాల రామ నరసింహారావు, కంచర్ల రామారావు, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, తొండపు సరిత, కురివెళ్ల సంధ్యారాణి. తొండపు నవీన్, పెండ్యాల కృష్ణమూర్తి, పెండ్యాల సత్యనారాయణ, వందనపు కమలాకర్ రావు, కురివెళ్ల కృష్ణారావు, చిట్లూరి మహేష్ బాబు, తొండపు పార్థసారథి, కొదుమూరి సనత్ కుమార్, వెచ్చా రమేష్, పెండ్యాల మురళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.