కంటోన్మెంట్ జనం సాక్షి ఏప్రిల్ 30 శ్రీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330వ ఆరాధన మహోత్సవాలు లో ముఖ్యఅతిథిగా రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అనంతర కార్యక్రమంలో ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః స్మరణతో సహస్రనామ జపయజ్ఞ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సహచనామార్చన,విశ్వశాంతి యజ్ఞం, పారాయణ నిర్వహించారు.అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ శ్రీ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330వ ఆరాధన మహోత్సవాలు పాల్గొన్న విశ్వకర్మ బంధు మిత్రులందరికీ ఆ స్వామి వారి దయ కటాక్షాలు ఎల్లవేళలా విశ్వకర్మ బంధుమిత్రులపై ఉండాలని ఇలాగే మీ ఆదరమానాలు ఇలాంటి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో విశ్వ కర్మ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించుటకు మీ సహకారం మరెన్నో కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని అని అన్నారు,అలాగే మానేపల్లి భాస్కరాచారి రచించిన శ్రీశ్రీశ్రీ సింహాద్రి సనారీ విశ్వనాథ అవధూత స్వామి మహి మాన్విత జీవిత విశేషాలు పుస్తకాన్ని విశ్వకర్మ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల చేతుల ఆవిష్కరించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గిర్మా పురం భాస్కరాచారి మాట్లాడుతూ జై వీర బ్రహ్మ జై విశ్వకర్మ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330వ ఆరాధన ఉత్సవాలకి విచ్చేసిన విశ్వకర్మ కుటుంబ సభ్యులు, బంధువులందరికీ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికి ఉండాలని వేడుకుంటున్న మా విశ్వకర్మ కమిటీ సకారంతో శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి 330వ ఆరాధన ఉత్సవాలు జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి రాంగోపాల్ పేట కార్పొరేటర్ చీర సుచిత శ్రీకాంత్ మరియు మా అడ్వైజర్లు పోచారం సుధాకర, దుబ్బాక కిషన్ రావు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అదేవిధంగా నూతన కమిటీ వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులోని భాగంగా విశ్వకర్మ సంఘం భవనం హాలు సుందరీకరించడం, సెల్లార్ గ్రౌండ్, ఫస్ట్,సెకండ్ ఫ్లోర్ అభివృద్ధి చేయడం జరిగింది, అలాగే నూతనంగా మరియొక్క లిప్ట్ ను ఏర్పాటు చేయుచున్నాము దీనికోసం ఇవాళ దాతలు ఐదున్నర లక్షల రూపాయలు సహాయసకర సహకారాలు అందించడం చేయడం జరిగింది, ఇంకా దాతలు సహాయము చేయదలచిన వారు అధ్యక్షా మరియ కమిటీ సభ్యులను కలిసి ఇవ్వవచ్చు అని తెలియజేశారు, మానవాళి కాల భవిష్యత్తు గురించి ముందుగా హెచ్చరించిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలోక కల్యాణార్థం 16వశతాబ్దంలో జన్మించారన్నారు.ధర్మాన్ని ఆచరించిన వారికి ఎటువంటి ఆపదలు అపవాదులురావని తెలిపిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిలోకి ప్రవేశించి 330 సంవత్సరాలు అయ్యింది, బాల్యంలో17సంవత్స రాలు యుక్త వయస్సు లో 16 సంవత్సరాలు తపస్సును ఆచరించి విశ్వశ్రేయస్సుకు అంకితమై తాళపత్ర గ్రంథాలలో విరచితం చేసిన 4లక్షల 32వేల సంవత్సరాల కలియుగానికి చెందిన 14వేల కాలజ్ఞాన తత్వ ప్రతుల ఆత్మజ్ఞాన బోధ అత్యంత మహి మాన్వితమైనదన్నారు. మంటల్లో వెలిసిన వినాయకుడు కలి యుగాంతంలో వీధి వీధినా వేదమంత్రాలు చదివిస్తూ వలవలా కన్నీరు పెడతూ సత్య యుగంవైపుకు దారి తీయిస్తారని తెలిపిన సత్యాలు కాలజ్ఞాన ప్రభోధకమని తెలియజేశారు.అనంతరం పెద్ద ఎత్తున విశ్వకర్మలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోవిశ్వకర్మ సంఘం అధ్యక్షుడు గోపాలపురం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గిర్మా పురం భాస్కరాచారి, ఉపాధ్యక్షుడు కటకం చక్రపాణి, కోశాధికారి బోనాల శ్రీనివాసచారి, సంయుక్త కార్యదర్శులు అయిల సంతోష్ కుమార్,మొగలిపురం బాల కిషోర్, సహాయ కోశాధికారి కొండపాక విశ్వేశ్వర్, ఇతర శాఖల చైర్మన్లు కార్యదర్శులు సీనియర్ మెంబర్స్,కార్యవర్గ సభ్యులు మరియు విశ్వకర్మ కుటుంబ సభ్యులు రాంగోపాల్ పేట్ డివిజన్ బిజెపి కార్యకర్తలపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




