Friday, 6 November 2026

ఘనంగా విజయ్ దివస్ వేడుకలు

ఘనంగా విజయ్ దివస్ వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి :
శుక్రవారం శామీర్ పేటలో విజయ్ దివస్ సందర్భంగా కెసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అమర్ జవాన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఒక నిముషం మౌనం పాటించి,నివాళులు అర్పించారు, వారి బలిదానాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో భారత సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయ్యకుండా వీరోచితంగా పోరాడి విజయం సాధించారని ,ఆ క్రమంలో ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండి , చదువుకున్న చదువు,తన ప్రతిభను దేశం,దేశ ప్రజల కోసం ఉపయోగించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు అఫ్జల్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, శశియాదవ్ , బత్తిని చందర్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
16ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు