Tuesday, 3 November 2026

ఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలుఘనంగా

ఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలుఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలు
– విద్యార్థులకు, అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ అధ్యక్షతన బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి పార్లమెంట్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు పట్టణంలో బుధవారం. ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ  వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్లు,  అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి స్వాములకు పండ్లను పంపిణీ చేశామన్నారు. అనంతరం స్కూల్ పిల్లల సమక్షంలో పార్టీ శ్రేణులు  కేక్ కట్ చేసి వివేక్ వెంకట స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ వేదికగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, పేద ప్రజలను ఆదుకున్నారని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలుమార్లు విన్నవించుకుంటూ, ఆ ఫ్యాక్టరీని రైతుల కోసం కృషి చేసి తిరిగి తెరిపించారన్నారు.  రానున్న రోజుల్లో వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ వెంకటస్వామి కి ప్రజలు బ్రహ్మరథం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేష్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు జంగపెల్లి మల్లయ్య, అరిగల రవీందర్, బీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, వీరమల్ల పాల రాజయ్య, శాంతపురి  శివ, బి జె వై ఎం కార్యదర్శి ఓరుగంటి సాయి, వైద్య శ్రీనివాస్, లక్ష్మణ్, బాలాజీ, పెనగరి రాజు, ఉప్పు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.