Tuesday, 3 November 2026

ఘనంగా శామీర్ పేట్  బొడ్రాయి ఊరేగింపు వేడుకలు

ఘనంగా శామీర్ పేట్  బొడ్రాయి ఊరేగింపు వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి :ఘనంగా శామీర్ పేట్  బొడ్రాయి ఊరేగింపు వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట్  గ్రామంలో బొడ్రాయి పండుగ సందర్బంగా నాభిశీల, పోతలింగరాజు విగ్రహాలను ఊరేగింపులో నాయకులు, ప్రజలు పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.  గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో రామాలయం లో పంతులు మురళి ధర్ శర్మ పూజలు నిర్వహించారు.గురువారం తో రెండు రోజుల పాటు  బొడ్రాయి ఊరేగింపు పూర్తయ్యింది. శుక్ర, శనివారలు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ బాలమణి సుదర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి సుదర్శన్, ఉప సర్పంచ్ రమేష్ యాదవ్,కట్ట మై సమ్మ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, కోశాధికారి రాబిన్,వార్డు సభ్యులు మురళి, శ్రీకాంత్, నవీన్ ఉమర్ ,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1ఎస్పీటీ -2: బొడ్రాయి ఊరేగింపులో నిర్వాహకులు