మల్దకల్ జనవరి 21(జనం సాక్షి)ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారుడు, నారదాంసులైన శ్రీ పురందరదాసుల ఆరాధన ఉత్సవాలు ఆదిశీలక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో వేద పాఠశాలలో శ్రీ పురందరదాసుల విగ్రహానికి పంచామృత అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం దాసుల వారి చిత్రపటంతో దేవాలయంలో రథోత్సవం పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి, శేషదాశవంశస్తులు దీరేంద్ర దాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు హరినామ సంకీర్తనం చేయుచు భజనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాబురావు, చంద్రశేఖర రావు,అరవింద్ రావు,నాగరాజుశర్మ, పద్మనాభయ్య భక్తులు పాల్గొన్నారు.




