హుజూర్ నగర్ మార్చి 18 (జనంసాక్షి): మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న
శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పాల్గుణ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సహస్రనామ పాల పుష్పార్చన బోనాల శ్రీనివాసరావుచంద్రకళ దంపతులచే జరుపబడింది. శనివారం తదుపరి పూజా కార్యక్రమం నిర్వహించిన దంపతులకు దేవస్థానం నుండి స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు పాల పుష్పాలు స్వామివారి తీర్థ ప్రసాదములు వితరణ జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముడుంబై మనోహరాచార్యులు, హరీష్ కుమారాచార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, జూనియర్ అసిస్టెంట్ గోవిందరెడ్డి, ఆలయ సిబ్బంది కిరణ్ గౌడ్, రమేష్, గోపాలకృష్ణ, వేణు, వెంకటి, తదితర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా సహస్రనామ పాల పుష్పార్చన




