రుద్రంగి మార్చి 11 (జనం సాక్షి)రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్.ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ… రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను చుస్తే రైతుల కష్టం గుర్తుకు వస్తుందని అన్నారు.ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం రాళ్ళపాలు అయిందని అన్నారు.తక్షణమే అధికారులు నష్టపోయిన పంటపొలాలను గుర్తించి ప్రభుత్వం తరపున రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుచేలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ముసుకు ముకుంద రెడ్డి,సామ మోహన్ రెడ్డి, మాడిశెట్టి అభిలాష్, మైపాల్,గణేష్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆది శ్రీనివాస్వర్షానికి




