ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి అలంపూర్ జనంసాక్షి (జనవరి 3)
అలంపూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అధ్యక్షతన చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భముగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ మాట్లాడుతు సావిత్రిబాయిఫూలే భారతదేశంలొని మహిళాలోకానికి ఎనలేని సేవలు అందించారు అన్నారు .నేటి మహిళాలోకానికి స్ఫూర్తిప్రధాత,వేల సంవత్సరాల స్ర్తీల బానిసత్వ విముక్తి మార్గదర్శిని,విద్యా,విజ్ఞానం,స్వేచ్ఛ,స్వాతంత్యాలను స్ర్తీజాతికి ప్రసాధించి అసమానతలు లేని సమాజం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త ఆమెఅన్నారు .భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయునీ సావిత్రిబాయిఫూలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ,కౌన్సిలర్లు జయలక్ష్మీ ,లక్ష్మీదేవమ్మ ,సుస్మా ,కోఅప్సన్ సభ్యులు అల్లబకస్ ,బిఆర్ఎస్ నాయకులు దేవరాజు ,మద్దిలేటి ,పెద్దమక్తర్ ,నాగరాజు ,వెంకటస్వామి ,మార్కెట్ యార్డు డైరెక్టర్ ఫయాజ్ ,మోహన్ ,ఎర్రన్న ,డ్రమ్స్ బాబుగారు,రాజు,మధుగారు,సామేలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి అలంపూర్




