మందమర్రి మండలం చిర్రకుంట శక్తి కేంద్రం సమావేశం…..
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాధ్ వెరబల్లి ఆదేశాల మేరకు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి నాయకత్వంలో మందమర్రి మండల అధ్యక్షులు ( పైడిమల్ల నర్సింగ్) అధ్యక్షతన ఈ రోజు మందమరి మండలం చిర్రకుంట శక్తి కేంద్రం పరిధిలో గల చిర్రకుంట సారంగపల్లి శంకర్పల్లి 3 బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (పొనాగంటి రంగారావు) . హాజరు కావడం జరిగింది.
అనంతరం………………………….
పైడిమల్ల నర్సింగ్
మాట్లాడుతూ
………………………………………….
మందమర్రి మండలంలో ఉన్న నాలుగు శక్తి కేంద్రం పరిధిలో 13 బూతుల్లో పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేయడం. ప్రతి బూతుల్లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయడం. తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పడం. తదుపరి ప్రతి బూతుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి బిజెపి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించడం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుంటే అందేలా అధికారులతో మాట్లాడి అంద చేయడం . ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజల కోసం పనిచేసే విధంగా కృషి చేస్తామని మందమరి మండల శాఖ తరపున మందమరి మండల ప్రజలకు హామీ ఇస్తున్నాము.
బిజేపి కేంద్ర ప్రభుత్వం పంపిన
గ్రామ పంచాయితీల 700 కోట్ల రూపాయలు నిధులు గోల్మాల్ ….
బిజెపి కేంద్ర ప్రభుత్వం 15 వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు 700 కోట్ల రూపాయలు గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ఖాతాలోకి వేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గంట వ్యవధుల్లోనే సర్పంచులకు ఎటువంటి సమాచారం లేకుండా 700 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్ళించడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇప్పటికీ సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయి గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పనులు చేయలేక సర్పంచులు అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న వైనం. గ్రామ పంచాయతీలకు ఒక శాపం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు మాలిన చర్య వల్ల కొమురం భీం జిల్లాలో 15 మంది సర్పంచ్ లు రాజీనామా చేయడం. సర్పంచులు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయడం. ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డివి దీక్షితులు. శక్తి కేంద్రం ఇన్చార్జి పళ్ళ పవన్ కుమార్. బూతు అధ్యక్షులు మరి నేనీ పోశం( చీరకుంట) . మంద రాజు రెడ్డి ( సారంగపల్లి ). దైనేని రమేష్ (సండ్రోన్ పల్లి) సభ్యులు మారినేని రామయ్య . దుర్గం వెంకటేష్ . జుమ్మిడి ప్రదీప్. రామ్ టెంకి శ్రీను. బుఖ్య రాజయ్య. సండ్ర కమల్. సండ్ర మల్లేష్ .బి పున్నం . కే శ్రీకాంత్ . బి రాజ్ కుమార్ . మధుకర్ .రంజిత్ .సిద్దు. నరేష్. రమేష్. లు పాల్గొన్నారు……..జనం సాక్షి




