Tuesday, 3 November 2026

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వేములవాడ, జనవరి 3 (జనంసాక్షి): వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రమీల సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళలు విద్యను అభ్యసించేలా ఎనలేని కృషిచేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఎనిమిదవ తరగతికి చెందిన జస్విక అనే విద్యార్థి సావిత్రిబాయి పూలే వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, రవీందర్, ఆనందం, సలాం, కోటేశ్వర్, హమీద్, శిరోమణి, జ్యోతి, శ్రీదేవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.