Tuesday, 3 November 2026

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
అశ్వరావుపేట జనవరి 3( జనం సాక్షి) పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటరు కూడలిలో సావిత్రిబాయి పూలే 192 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రింగ్ రోడ్డు సెంటర్ కూడలి లో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతితో బీసీ సంఘాల నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళలు విద్యను అభ్యసించేలా జనలేని కృషిచేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయురాలు సంగీత,దిశ సభ్యులుమావిళ్ళ వెంకట్ లక్ష్మి,సుల్తానాబేగం, బీసీ సంఘాల నాయకులు అంకోలు వెంకటేశ్వరరావు,తాళం సూరిబాబు,లింగిశెట్టి వెంకటేశ్వరరావు, వీరంకి దుర్గారావు, కట్రం స్వామి దొర, వేముల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.