సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తితో విద్యా ,సామాజిక హక్కుల కోసం పోరాడుతాం.
-కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న.
సావిత్రిబాయి పూలే 192 వ జన్మదినం పురస్కరించుకొని సిఐటీయ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య అని అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని అన్నారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి బాలికలకు విద్య నేర్పిన మొదటి మహిళా గురువు అని కొనియాడారు.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని తెలిపారు.నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని, సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని అన్నారు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభి వృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు నేటికీ దేశంలో మహిళ లు విద్యకు సామాజిక గౌరవాలకు దూరంగా ఉన్నారని అన్నారు సంప్రదాయాల పేరుతోని కట్టుబాట్లతోని మహిళలని సమాజానికి దూరంగా ఉంచుతున్నారని అన్నారు.సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తితో విద్యా సామాజిక హక్కుల పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గుంపల్లి అశోక్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కేతపల్లి సత్యనారాయణ సిఐటియు నాయకులు మేస్త్రి అశోక్ రాజు రాములు కృష్ణ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.




