Sunday, 8 November 2026

ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

టేకులపల్లి, డిసెంబర్ 26( జనం సాక్షి ): మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఘనంగా వేడుకజరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 98 వ సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో నిరుపేదల కోసం అనేక పోరాటాలు చేసి భూమి లేని వారికి భూ పంపిణీ చేయించి, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు,పోడు భూముల పోరాటం, పేదల కోసం పుట్టిన సిపిఐ పార్టీ వారి పక్షానే నేటికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ పేదవాడికి అండదండలుగా సిపిఐ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. కూడు, గూడు,గుడ్డ పేదవానికి అందే వరకు సిపిఐ పార్టీ నిరంతరముగా పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అన్ని వర్గాల ప్రజల కొరకు ఎన్నో ఎన్నెన్నో పోరాటాల ద్వారా వారి యొక్క హక్కులను సాధించిన పార్టీ సిపిఐ పార్టీ అని 98 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సిపిఐ పార్టీని మనమందరం కలిసి ఉన్నత శికారాలకు తీసుకువెళ్లాలని,నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సహాయ కార్యదర్శులు ఎజ్జు భాస్కర్, గుగులోతు శ్రీను, తేజావత్ లక్ష్మణ్,వి సతీష్, భద్రయ్య, నరేష్,మధు, రవీందర్,యువరాజు,అవంతిక,సోనీ,విజయలక్ష్మి, భారతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.