Sunday, 8 November 2026

స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి

స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి * సిపిఐ ఎంఎల్ (ప్రజా పందా) జిల్లా నాయకులు దుబ్బాకుల ప్రసాద్

టేకులపల్లి, డిసెంబర్ 26 (జనం సాక్షి ): రైతాంగం పండించిన పంటలన్నింటికీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కనీసం మద్దతు ధర నిర్ణయించాలని కనీసం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ ( ప్రజాపంధా ) జిల్లా నాయకులుదుబ్బాకుల ప్రసాద్ అన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పిలుపుమేరకు డిసెంబర్ 20 నుండి 27 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జరుగు ఆందోళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సంఘం కరపత్రాలను మండలంలోని పలు గ్రామాలలో పంపకం చేసి ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలన్నింటికీ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఖర్చుల మీద 50% లాభం కలిపి కనీసం మద్దతు ధరలు నిర్వహించాలని,కనీస మద్దతు ధరల చట్టం వెంటనే పార్లమెంటులోసిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలుకు చర్యలు వేగవంతం చేయాలని, రైతుల అమ్మిన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం వ్యవసాయ పంటలకు మద్దతు ధర ఇస్తామని మోడీ నాయకత్వంలోని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చి ప్రచారం చేసిందని, అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందని అన్నారు.రైతాంగ ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి అధికారం చేపట్టే లక్ష్యంతో 2019 బడ్జెట్ సమావేశాలలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని, కానీ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి, అ సమగ్రమైన ఖర్చులు ప్రాతిపదికన మాత్రమే అమలు చేస్తుం