సిఐటియురాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చలమాలకు ఘనంగా పౌర సన్మానం
పెనుబల్లి, డిసెంబర్ 26(జనం సాక్షి)
నూతనంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన చలమాల విట్టల్ రావు కు సోమవారం ఘనంగా పౌర సన్మానం జరిగింది, మహబూబ్ నగర్ లో జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభల్లో ఆయన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని వి ఎం బంజర్ రింగ్ సెంటర్లో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు ,శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నరసింహారావు, వంగాగిరి జాపతి, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, తాండ్ర రాజేశ్వరరావు, నాగ ప్రసాద్, కొప్పుల గోవిందరావు, మిద్దె స్వామి, మల్లెల శ్రీనివాసరావు, అన్నపురెడ్డి లక్ష్మయ్య, బెజవాడ సాయి శేషు, టాక్సీ అసోసియేషన్ అధ్యక్షులు భూషణం, బజ్జూరి నాగేశ్వరరావు, మల్లెల రాజా,తదితరులు పాల్గొన్నారు.




