Saturday, 7 November 2026

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 53 మంది ఆడపడుచులకు కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 53 మంది ఆడపడుచులకు కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ

బాల్కొండ డిసెంబర్ 24 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 7 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను శనివారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,సర్పంచి భూస సునీత,తహశీల్దార్ వినోద్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చేతుల మీదుగా బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి),చిట్టాపూర్,బోదెపల్లి, జలాల్పూర్,నాగపూర్ 7 గ్రామాలకు చెందిన 53 కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్నీ ప్రవేశ పెట్టారని ఒక్కొక్క లబ్దిదారులకు రూ1 లక్ష ఒక వంద పదహారు రూపాయలు చొప్పున అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పేద కుటుంబాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక తోబుట్టువుగా ఉన్నారని ప్రతీ ఒక్క ఆడపడుచుకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు EP నారాయణ,అనుగుల రాంరాజ్ గౌడ్,కన్న లింగవ్వ-పోశెట్టి,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,జక్క లింబారెడ్డి,చించు శ్రీనివాస్ గౌడ్,కోట మురళీ,రైతు బంధు మండల కో ఆర్డనేటర్ నాగులపాల్లి రాజేశ్వర్,సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి,డైరెక్టర్లు సయ్యద్ మాజారోద్దీన్,డాక్టర్ ప్రసాద్ గౌడ్,గ్రామశాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,కోటగిరి శ్రీకాంత్ చారి,నోముల మోహన్, న్యావనంది సాయన్న,ఎంబరి శరత్,చాట్లపల్లి గోవర్ధన్ గౌడ్, పెంటూ లింబాద్రి,సనుగుల శ్యామ్ సుందర్,గడ్చందా అనిల్,కర్రె గంగయ్య,మాజీ ఎంపిపి మానేటి నాగభూషణం,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తాకారోద్దీన్,వార్డు సభ్యులు గాండ్ల రాజేష్, సయ్యద్ రియాజ్ అలీ,స్వామీ నాథ్,తెరాస నాయకులు భూస నరహరి,పోలేపల్లి లక్ష్మీ నారాయణ,తలారి రాజేందర్,తోపారం గంగాధర్,నల్లురి హరికృష్ణ,దూధాటి సూర్యప్రకాష్,మహమ్మద్ అన్వర్,సయ్యద్ రియాజొద్దిన్,షేక్ ఆరిఫ్, మెట్టు అశోక్,అబ్దుల్ కాజిం,నార్ల రాజు,మగ్గిడి రాయధాసు,తెడ్డు చక్రి,రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్,RI రాఘవేందర్,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.