Sunday, 8 November 2026

ఘనంగా సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవం

ఘనంగా సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవం
పేద ప్రజల సమస్యల పరిష్కరమే సీపీఐ లక్ష్యం
జెండా ఆవిష్కరణ చేసిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి డిసెంబర్ 26 జనం సాక్షి న్యూస్ :
సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, కొండ మల్లేపల్లి లో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో డిసెంబర్ 26న ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనేక కుట్ర కేసులు ఎదుర్కొని, లక్షలాదిమంది ప్రాణ త్యాగాలతో,ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన ఘనత సిపిఐ దే నని, సీపీఐ 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడు,గూడు లేనటువంటి నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా ముందు ఉంటుందని వారు అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల500 మంది ప్రాణాలు ఇచ్చి, లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీలకు లేదని వారు కొనియాడారు.నేడు పాలకవర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగిస్తూ నిత్యం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నదని అని తెలిపారు. దేశ సంపదను ఆధాని,అంబానీలకు దోచి పెడుతూ, వారికి రాయితీలు ఇస్తూ రైతులని, కార్మికుల్ని, పేద ప్రజల నడ్డి విరుస్తూ,వారి సంక్షేమాన్ని గాలికి వదిలేయడం సరైనది కాదని ఇప్పటికైనా పాలక వర్గాలు ఉన్నత వర్గాలకు ఊడిగం చేయడం మానుకొని పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాల పాలన కొనసాగించాలని వారు తెలిపారు. పాలకులు ఇచ్చిన హామీల అమలు కోసం రాబోయే కాలంలో పోరాటాలు తీవ్రతరం చేస్తామని ఆయన మండలంలోని చేన్నమినేనిపల్లి, చింతకుంట్ల గ్రామాల్లో కూడా సిపిఐ జెండాలు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వర రెడ్డి సహాయ కార్యదర్శి పెరికేటి శేఖరాచారి,పి శ్రీను, బానోతు సోమ్లా నాయక్ ,కల్లు చరణ్ రెడ్డి, సుంకయ్యా,హరి,వంపు ధర్మయ్య,వెంకటయ్య,ఎల్లయ్య, సోమ్ల, శేఖర్,పాండు, పర్ష్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.