Sunday, 8 November 2026

తెలంగాణ రాష్ట్ర కారోబార్ బిల్ కలెక్టర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర కారోబార్ బిల్ కలెక్టర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన మంత్రి హరీష్ రావును సన్మానించిన రాష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ కొండమల్లేపల్లి డిసెంబర్ 26 జనం సాక్షి న్యూస్ : సోమవారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ కారోబార్ బిల్ కలెక్టర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే నాయుడు ల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా ములుగు జిల్లా సిద్దిపేట జిల్లా కామారెడ్డి సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ హనుమకొండ జనగాం సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి కొమరం భీంఅసిఫాబాద్ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సిరిసిల్ల జిల్లాల నుండి సంఘ నాయకులు హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు ఉద్యోగస్తుల సమస్యలు సానుకూలంగా విని పరిష్కార మార్గంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. జనవరి మాసంలో క్యాలెండర్ డైరీ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కారోబార్ బిల్ కలెక్టర్ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర సలహాదారులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుండాల మల్లేష్ గౌడ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర కమిటీ వెంకటేశం , వెంకట్ రెడ్డి, సదానందం,శ్రీకాంత్, అనిల్,రఘు, సాగర్, ప్రభాకర్, రవీందర్, రాంబాబు, సిద్దిపేటజిల్లా ,కామారెడ్డి జిల్లా ,,యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా , నల్లగొండ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంచిర్యాల , నాగర్ కర్నూలు జిల్లా వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు