Wednesday, 4 November 2026

హెల్ప్ వీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు.

..
ఇంద్రవెల్లి జనవరి 23 (జనం సాక్షి)
ఇంద్రవెల్లి : సమరయోధుడు, ఆంగ్లేయులను దేశం నుండి తరిమేయడానికి ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అంబేద్కర్ మెమోరియాల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సర్కాలే శివాజీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని హెల్ప్ వీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పలువురు నేతాజీ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అతిష్,భాస్కర్,ఖానాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు దత్త, వైఎస్సార్టిపి మండల అధ్యక్షుడు ఆరిఫ్ ఫారిక్, భీం ఆర్మీ మండల అధ్యక్షుడు ఉత్తం,బాబా తదితరులు పాల్గొన్నారు