Sunday, 8 November 2026

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
జహీరాబాద్ డిసెంబర్ 23 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని పచ్చతోరణం రెస్టారెంట్ లో ముందస్తు సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం క్రిస్మస్ ప్రేమ విందు నిర్వహించారు. నిర్వాహకులు ఎర్రోళ్ల ప్రభాకర్, శ్రీకాంత్,అమృత్, సన్నీ, రాజు, లాజర్, రవి కిరణ్ బృందం ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రపంచంలోనీ మానవాళికి మంచి జరగాలని మనుషుల కు పడాల్సిన శిక్షలు దేవుడే మోషాడని అందుకే యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచంలో నే ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు,ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మిత్రులు పాల్గొన్నారు.