Sunday, 8 November 2026

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్(24): ఉమ్మడి గోపాల్‌పేట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికీ చెందిన స్వామి, వెంకటయ్య, ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ఏఐసీసీ సెక్రటరీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి శనివారం గొల్లపల్లి గ్రామానికి వెళ్లి మృతుల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మృతుల కుటుంబసభ్యులని పరమర్శించి వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ శాంతయ్య , భాస్కర్ రావు, బీరయ్యా ,చీర్ల చందర్, వనపర్తి జిల్లా NSUI అధ్యక్షుడు రోహిత్, దిలీప్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.