Friday, 6 November 2026

విద్యార్థిని అభినందించిన డి ఈ ఓ

విద్యార్థిని అభినందించిన డి ఈ ఓ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 9. (జనంసాక్షి) జాతీయస్థాయి కళా ఉత్సవ్ 2022 కు ఎంపికైన విద్యార్థిని డిఇఓ రాధాకృష్ణ అభినందించారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేటలో 9వ,తరగతి చదువుతున్న వంగరి కీర్తన బాలల కళా ఉత్సవ్ 2022కు విజువల్ ఆర్ట్స్ 3d విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం నిలిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల విద్యార్థినికి ధనాలకోట రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓ శైలజ పి ఈ టి సానుబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలాస మల్లేశం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.