Friday, 6 November 2026

రామానుజన్ గణిత ఒలంపియాడ్ లో జయ విద్యార్థుల ప్రతిభ

రామానుజన్ గణిత ఒలంపియాడ్ లో జయ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రామానుజన్ గణిత అకాడమీ – రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్ ఫైనల్ లెవెల్ లో తమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు జిల్లా , జాతీయ స్థాయి ర్యాంకులను సాధించినట్లు జిల్లా కేంద్రంలోని జయ ఐఐటి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుండి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ ను మేక సాత్విక్ , 5వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంక్ రాగి విశ్వక్ ధ్రువ , 7వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంక్ కొమ్ము కార్తికేయ , 8వ తరగతి నుండి జిల్లా రెండవ ర్యాంక్ రంగ సుహాన్ , 9వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంక్ కర్నాటి జశ్వంత్ , రెండవ ర్యాంక్ గుత్తికొండ అభినవ్ రెడ్డి , 10వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంక్ గోలి సాయిచరణ్ రెడ్డి, రెండవ ర్యాంక్ గుడిపెల్లి తేజశ్రీ సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, అత్యుత్తమ ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులను అభినందించిన వారిలో పాఠశాల డైరెక్టర్లు జెల్లా పద్మ , బింగి జ్యోతి , ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.