ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
ఖమ్మం.తిరుమలాయపాలెం (డిసెంబర్ 9) జనం సాక్షి.
తెలంగాణ కలను సకారం చేసిన,తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మ దిన వేడుకలను పాలేరు నియోజకవర్గం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు, మొదట పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రం లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాబీ షేకం చేశారు అనంతరం పాలేరు నియోజకవర్గం కేంద్రం లో కేక్ కట్ చేసి సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, రాబోయే ఎన్నికల్లో తెలంగాణా లో కాంగ్రెస్ ను అధికారం లో కి తీసుకొచ్చి తెలంగాణా తల్లి సోనియమ్మ కు కానుక గా ఇవ్వాలి అని కార్యకర్తలకు పిలుపు ను ఇచ్చారు, అనంతరం కార్యకర్తలతో లంచ్ మీటింగ్ జరిపారు, ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి కొరివి వెంకట్ రత్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు హఫీజ్ , మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు వినోధ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నీరుడు లాజరస్, గుగులోతు వీరన్న, కూసుమంచి మండల కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఛైర్మెన్ మునిగంటి రాములు, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు కనకం మైసయ్య, బానోతు వినోద, మైనారిటీ కాంగ్రెస్ జిల్లా నాయకులు సాజిద్ పాషా, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారు పల్లి శ్రీనివాసరావు, మంకేన వాసు , మధుసూదన్ రావు ,యువజన కాంగ్రెస్ నాయకులు బానోత్ రవి ,ఆలేటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు




