Friday, 6 November 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

 

పెద్దేముల్ డిసెంబరు 9 (జనం సాక్షి)
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్, తట్టేపల్లి ఎంపిటిసి శంకర్ కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ చలవతోనే దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. పెద్దేముల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వచ్చే ఎన్నికల్లో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు జరుపుకున్నారు.