Friday, 6 November 2026

తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ కి76వ,జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ కి76వ,జన్మదిన వేడుకలు..

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) ధర్మపురి పట్టణ కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసిన ప్రదాత సోనియాగాంధీ 76వ, జన్మదిన వేడుకలు శుక్రవారం ఉదయం ధర్మపురి నియోజ కవర్గ కేంద్రంలోని నంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించడం జరిగింది సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్,వేముల రాజేష్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్,చిలుముల లక్ష్మణ్,రాందేని మొగిలి,కస్తూరి శ్రీనివాస్,సీపతి సత్యనారాయణ,కట్టబువనేశ్వర్, సుముఖ్, అప్పం తిరుపతి,స్థంభం కాడి గణేష్,షబ్బీర్,ఆసెట్టి శ్రీనివాస్, రమేష్, పోచయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు.