Wednesday, 4 November 2026

ఘనంగా సోమేశ్వర ఆలయ వార్షికోత్సవం.

 

 

 

 

ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.2) స్వామి వారి కళ్యాణం.3) నాగేంద్రుని వెండి విగ్రహం ప్రతిష్టాపన.
బెల్లంపల్లి, జనవరి 26, ( జనంసాక్షి )బెల్లంపల్లి మండలం బుదకలాన్ గ్రామంలో గురువారం సోమేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్బంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమేశ్వరుని కల్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి వెండి నాగేంద్రుని విగ్రహ ప్రతిష్టాపన చేశారు. భక్తిభావంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో వేద మంత్ర పండితులు, పూజారులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.