కొడకండ్ల,జనవరి26(జన సాక్షి) కొడకండ్ల మండల కేంద్రం లోని మై రెడీమర్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలునిర్వహించారు.మై రెడీమర్ స్కూల్ చైర్మెన్ జాషువా, నవమని లు జండా ఆవిష్కరించారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక నెలలోనో జరిగినది కాదని దీని వెనుక అపారమైన కృషి ఉంది. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది అన్నారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది అని తేలిపారు.అనంతరం పిల్లలు,పోలీస్, మిలిటరీ, నెహ్రూ, భారత మాత , అంబేద్కర్ వేషాలతో వచ్చిన పిల్లలని ప్రిన్సిపాల్ ప్రసన్న అభినందించారు.
ఈ కార్యక్రమం లో ఇంఛార్జి హెడ్ మాస్టర్ నాగాలాండ్ సునప్ జమీర్, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,తల్లి దండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




