Wednesday, 4 November 2026

వాడవాడలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా బిచ్కుందలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

బిచ్కుంద జనవరి 26 (జనంసాక్షి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండల కేంద్రాలతో పాటు వాడవాడలో 74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ జెండా రెపరెపలాడింది. బిచ్కుంద మండలకేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ నాల్చర్ భారతీ రాజు పాల్గొని మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాలకు ఎన్నో హక్కులు, విద్యా, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లకు, రక్షణలకు రూపం ఇచ్చిన రోజు కావడం వల్ల ఇది మనకు గొప్ప జాతీయ పండగ అని అన్నారు. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటామని, మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు వందనం అభివందనం పాదాభివందనం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య అధికారులు, సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.