Monday, 2 November 2026

ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):మోతె మండల పరిధిలోని రాఘవాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఎమ్మెల్యేగా మడూరి మైథిలి, జిల్లా కలెక్టర్ గా కొరుపెల్లి లితిక్, డిఈఓగా లావణ్య , ఎంఈఓగా జస్వంత్, హెచ్ఎంగా బూడిద అమిత్ కుషన్ వ్యవహరించారు.చిన్నారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి.అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గంగులు, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, ఉపసర్పంచ్ రేణుక , విద్యా కమిటీ చైర్మన్ ఉపేందర్, వినోదాభాయ్, రోజా, పార్వతి, నరసింహ, సైదులు,రవి,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.