Monday, 2 November 2026

వేసవికాలములో జీవాల పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలి….

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి1(జనంసాక్షి):సామూహిక నట్టల నివారణ కార్యక్రమములో బాగంగా జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డా.జి.వి.రమేష్ బిజినపల్లి మండల కేంద్రములో పశుసంవర్ధక శాఖ ఆద్వర్యంలో గోర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణి చేయటము జరిగినది.ఈకార్యక్రమములో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోవు వేసవి కాలములో గొర్రెల కాపరులు తమ జీవాలను వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచించారు.ప్రతిరోజూ తమ జీవాలను ఉదయాన్నే మేపులకు తీసుకుని వెళ్లి ఎండ తీవ్రత పెరగకముందే సుమారుగా మద్యాహ్నము 12:00గంటలలోపు దగ్గరలోని చెట్టు నీడకు గానీ మరియు చల్లని నీడనిచ్చే ప్రదేశాలకు తీసుకుని వెళ్లి వడదెబ్బ బారిన పడకుండా చూడాలి.జీవాలకు పరిశుబ్రమైన పారే నీళ్ళను మాత్రమే తాపీ జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు.వేసవి కాలములో జీవాలకు పచ్చిమేత దొరకని క్రమములో గొర్రెల కాపరులకు అందుబాటులో ఉన్నటువంటి అవిస,సుబాబుల్,తుమ్మ మొదలగు చెట్లనుంచి లభించే పచ్చి మేతను జీవాలకు ఉపయోగించాలి అని తెలియ చేశారు.ఈ కార్యక్రమములో బిజినపల్లి మండల పశువైధ్యాదికారిని డా.జీవిత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.