ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
మెట్పల్లి టౌన్, జనవరి 12,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలో నరేంద్ర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం రోజున భారతీయ సంస్కృతి, హిందూ మతం గురించి ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దేశ భక్తుడు,నిస్వార్థ ప్రేమ దేశం పట్ల అంకితభావం, పలు రకాల బోధనలను చేసిన స్వామి వివేకనంద జయంతి ని పురస్కరించుకొని కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక వంద అరవై వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోలు రవి మాట్లాడుతూ ఆయన చేసిన బోధనలను నేటి యువత ఆచరించాలన్నారు.స్వామి వివేకానంద దేశభక్తుడు ఆధ్యాత్మిక భావాలు కలిగిన బోధకుడు పెద్దలపట్ల మర్యాద ఏ విధంగా విద్యార్థిని విద్యార్థులు ఇచ్చిపుచ్చుకోవాలో వారి మాటల్లోనే పరిపూర్ణమైన విద్యాభావం గల మాటలతో ఎంతోమందికి విద్యార్థులకు విద్య సూక్తులు, దేశ భక్తి కోసం దేశభక్తి సూక్తులు వారి ప్రబోధాలు ఎంతోమంది విని ఆకర్షితులై అయ్యారని అన్నారు,
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోలు రవి ,అధ్యాపక బృందం రమేష్ ,సాగర్, సత్యనారాయణ, లింగమూర్తి, నగేష్, సంజీవ్, స్రవంతి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు




