Thursday, 5 November 2026

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

 

 

 

 

 

 

 

 

కొత్తగూడ మే 14 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలను హనుమాన్ సేవ సమితి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హోమం,ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారికి పానకంతో పంచామృతములతో అభిషేకము నిర్వహించారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకారము,హనుమాన్ చాలీసా పారాయణం,హనుమత్ మూల మంత్రములచే భజనలు,కీర్తనలతో జయంతి ని నిర్వహించారు.అనంతరం హనుమాన్ మాలధారణ వేసిన స్వాములు ఇరుముడి కట్టుకొని మాల విరమణకై భద్రాచలంకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కొలనుపాక పవన్ ఏర్పాటు చేయడం జరిగింది.జయంతి లో గురు స్వాములు రమేష్,కల్లూరి కృష్ణ,రాంబాబు,శోభన్,శ్రీను(గోల్డ్),నితిన్,కన్నెస్వాములు,గదస్వాములు,గంటస్వాములు,భక్తులు పాల్గొన్నారు.