మల్కాజిగిరి.జనంసాక్షి.మే14వివిధ కారణాలవల్ల మహిళలు మాతృత్వానికి దూరమవుతున్నారని, అలాంటి వారికి ప్రత్యేక చికిత్స ద్వారా సంతానం అందించేందుకు మాతృత్వా మెటర్నిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రసన్నలక్ష్మి కృషి చేయడం అభినందనీయమని బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి,డిఫెన్స్ కాలనీ, వాయుపురి సొసైటీల అధ్యక్షులు నిమ్మగడ్డ విజయ సారథి,టి.జే రెడ్డిలు పేర్కొన్నారు.ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృత్వ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్,మహిళా విభాగానికి చెందిన వార్డ్స్ ను ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యాప్రాల్,అమ్ముగుడా, నిర్మల్ నగర్,డిఫెన్స్ కాలనీ,వాయుపురి ,నేరేడ్మెట్,సైనిక్ పురి,తులసి గార్డెన్, కందిగూడ తదితర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా మాతృత్వ హాస్పిటల్ నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.సంతానం కోసం పరితపించే మహిళలకు మాతృత్వ మెటర్నరీ జనరల్ హాస్పిటల్ ఓ వరమని తెలిపారు.సంతానం కోసం వచ్చే మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు.మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఆపరేషన్ థియేటర్,జనరల్ వార్డ్,స్పెషల్ రూమ్స్,రక్తపరీక్ష కేంద్రం,ఫార్మసీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కల్తీ ఆహారం కారణంగా మహిళలు ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారని, ప్రధానంగా సంతానలేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం తాము మాతృత్వ మెటర్నటి జనరల్ ఆస్పత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు.అధునాతన పరికరాలతో,నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చెన్నారెడ్డి,మాధవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శివ,డిఫెన్స్ కాలనీ సొసైటీ సభ్యులు శివయ్య,ప్రకాష్ రెడ్డి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




