Thursday, 5 November 2026

ఘనంగా హరి సింగ్  నాయక్ జన్మదిన వేడుకలు అనాధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన సులానగర్ యూత్

 

 

 

 

 

 

టేకులపల్లి,ఏప్రిల్ 15( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  బానోత్ హరిసింగ్ నాయక్ జన్మదిన వేడుకలను సులానగర్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా   కొత్తగూడెం పట్టణ సమీపంలో గల హేమ చంద్రపురం గ్రామంలో ఆమ్మ అనాధ ఆశ్రమంలో సుమారు 200 మంది వృద్ధులకు  టేకులపల్లి మండలం సులానగర్  గ్రామానికి చెందిన హరి సింగ్ నాయక్ అభిమానులు,బిఆర్ఎస్ నాయకులు ఆశ్రమంలో వృద్ధుల అందరి మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, స్వీట్లుపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు  కుమ్మరి గురవయ్య, కుమ్మరి కిరణ్, కొట్టే సురేష్,బొడ రమేష్, కమలాకర్, సూరేపల్లి  చంటి,రవి కేలోత్ కుమార్, ఎలేషియా, రాజ్ కుమార్,వినోద్, బాలాజీ, నెహ్రూ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.