జెండా ఆవిష్కరించిన టేకులపల్లి మండల అధ్యక్షులు మోతీలాల్టేకులపల్లి, ఫిబ్రవరి 9( జనం సాక్షి): టి ఎస్ పి ఆర్ టి యు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం టేకులపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం ముందు ఆ శాఖ మండల అధ్యక్షులు గుగులోతు మోతీలాల్ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా జిల్లా అధ్యక్షులు డి. వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంక్షేమానికి పి ఆర్ టి యు సంఘం విశేషమైన కృషి చేస్తుందని, పి ఆర్ సి , సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించిన ఘనత ఈ సంఘాని దేనని, ముఖ్యమంత్రిని ఒప్పించి ఉపాధ్యాయుల పదోన్నతి,బదిలీల ప్రక్రియను సాధించుకున్నామని, అవసరమైతే ఉద్యమం చేసి రాబోవు కాలంలో మరిన్ని ప్రయోజనాలు సాధించి పెడతామని అన్నారు. వచ్చే ఎన్నికలలోపు సీపీస్ విధానం రద్దు చేయుటకు, ఆశ్రమ సింగరేణి సి ఆర్ టి ల సమస్యల పరిష్కారానికి, కేజీబీవీ, 317 అన్ని సమస్యలు,గురుకుల బదిలీల ప్రక్రియ చేపట్టుటకు పి ఆర్ టి యు సంఘం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి టి. సర్కార్, రాష్ట్ర కార్యదర్శి బి ఎం వి . నిర్మల, జిల్లా ఉపాధ్యక్షులు టి.రవీందర్, జిల్లా కార్యదర్శి కె .ప్రసాద్, సత్యనారాయణ, బి.బాలాజీ, పి. సమ్మయ్య, బి.రమేష్ బాబు,డి.రాజేష్ ఖన్నా, జె.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.




