Wednesday, 4 November 2026

తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్.

 

 

 

 

 

 

ఆదానికోసం పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ మౌనం.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 9. (జనంసాక్షి). పార్లమెంటు సమావేశంలో ఆదానీ విషయంలో పార్లమెంట్ విచారణ కమిటీ వేయాలని కోరిన ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండా వహించడం వెనుక కారణం ఏమిటని తెలంగాణ పవర్ లు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ ప్రశ్నించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విజయ్ మాల్యా తో పాటు అనేకమంది ఎగవేతదారులను దేశం దాటిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందని అన్నారు. నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ సంగతి ఏమైందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచావుగా అమ్మేస్తూ మోడీ అనునయులకు 19 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. దేశాన్ని కుదిపేవేసిన ఆదాని వ్యవహారంలో పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు పార్లమెంటు స్థాయి విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరిన సమాధానం చెప్పకుండా ప్రధాని మోడీ మౌనం వహించాలని అన్నారు. దేశం పేరు ధర్మం పేరు చెబుతూ ఎగవేత దారులకు అండగా ఉంటున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవకులు మాట్లాడుతున్నారని బ్యాంకులకు 18 కోట్లు ఎగవేసిన రాణి రుద్రమ విషయాన్ని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ మాట్లాడుతూ సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మంత్రి కేటీఆర్ పట్ల మరోసారి తప్పుడు విమర్శలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బత్తుల వనజ, కౌన్సిలర్ దిడ్డి మాధవి, మ్యాన రవి, ఎండి సత్తార్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.